రసాభాసగా సాగిన సర్వసభ్య సమావేశం..! 8 h ago
AP : కడప సర్వసభ్య సమావేశంలో హైడ్రామా నెలకొంది. సమావేశంలో తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బిల్లుల ఆమోదంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని బిల్లులు ఆమోదించామని సమావేశం నుంచి మేయర్ వెళ్లిపోయారు. ఈ మాత్రం దానికి సమావేశం ఎందుకు? ఇంట్లో బెడ్ రూమ్ లో కూర్చొని ఆమోదం తెలుపుకోవచ్చు కదా అంటూ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడ్డారు. పోటాపోటీ నినాదాలతో రసాభాసగా సర్వసభ్య సమావేశం సాగింది.